- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని డీకంపల్లి గ్రామానికి చెందిన జిలకర ముత్తెమ్మ(69) గురువారం రాత్రి గడ్డి మంది త్రాగడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ శుక్రవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ముత్తేమ్మ గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బడపడుతుందని, గురువారం రాత్రి 8 గంటల సమయంలో గడ్డి మందు త్రగటంతో కుటుంబీకులు గమనించి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 10.20 గంటలకు మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు జిలకర పోషెట్టి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
- Advertisement -