Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్టీపీసీసీ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

టీపీసీసీ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధకృష్ణన్ జయంతి సందర్బంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు కామారెడ్డి పట్టణం పరిధిలో 25 మంది ఉపాధ్యాయులను శాలువ, మెమంటో లతో  స‌త్క‌రించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైందని పేర్కొన్నారు. దేశానికి మంచి పౌరులను అందించేది కేవలం ఉపాధ్యాయుడేనని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియా, రామారెడ్డి ఎంఈఓ ఆనంద్ రావ్,
పిఆర్టీయూ అసోసియేటెడ్ ప్రసిడెంట్ గోవర్ధన్, సీనియర్ ప్రధానోపాధ్యాయులు గంగాకిషన్, మాజీ కౌన్సిలర్లు జూలూరు సుధాకర్, చాట్ల వంశీ కృష్ణ, పంపరి శ్రీనివాస్, పిడుగు మమత సాయిబాబ, తాటి ప్రసాద్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు గంగా కిషన్, జంగం శ్రీశైలం, రాములు, మల్లేష్, మార బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad