భిన్న పాత్రలు, వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్‌గా నిలిచారు హీరో నాని. అలాగే అభిరుచిగల నిర్మాతగానూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. శుక్రవారంతో ఆయన సినీ ప్రయాణం దిగ్విజయంగా 17 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షనర్ ‘ది ప్యారడైజ్’ నుంచి పవర్ ఫుల్ స్టిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ స్టిల్‌లో నాని కంప్లీట్ బీస్ట్ మోడ్‌లో కనిపిస్తూ, ఇప్పటివరకు ఎన్నడూ చూడని ఫెరోషియస్ అవతార్‌లో ఆకట్టుకుంటున్నారు. దీంతో ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ప్యారడైజ్’లో నాని జడల్ క్యారెక్టర్‌లో సర్‌ప్రైజ్ చేయబో తున్నారు. ఈ క్యారెక్టర్ కోసం జిమ్‌లో ఇంటెన్స్‌గా వర్క్ అవుట్ చేస్తున్నారని ఈ స్టిల్ చెప్పకనే చెబుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, రా స్టేట్మెంట్, గ్లింప్స్ వీడియోలకు నేషనల్ వైడ్‌గా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన మ్యాసీవ్ సెట్స్‌లో జరుగుతోంది.
‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ మొత్తం ఎనిమిది భాషల్లో రిలీజ్ అవుతూ ఇండియన్ సినిమాలో మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాలలో ఒకటిగా నిలవనుందని చిత్ర యూనిట్ తెలిపింది.
దిగ్విజయంగా 17 వసంతాలు పూర్తి
- Advertisement -
- Advertisement -