- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.ఈ క్రమంలో నేడు(శనివారం) శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వారాంతం ప్రారంభం కావడంతో భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్ లో వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(శుక్రవారం) శ్రీవారిని 69,531 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 31,439 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.49 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
- Advertisement -