Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మండల కేంద్రంలో ఇంటింటికి షెత్కరి గణేష్ మండలి లడ్డు ప్రసాదం పంపిణీ

మండల కేంద్రంలో ఇంటింటికి షెత్కరి గణేష్ మండలి లడ్డు ప్రసాదం పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: గణేష్ ఉత్సవాలు శనివారానికి 11వ రోజు అవుతున్న సందర్భంగా మండల కేంద్రంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిమజ్జన రోజు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన షెత్కరి గణేష్ మండలి లడ్డు ప్రసాదాన్ని నిర్వాహకుల ద్వారా ఇంటింటికి శనివారం ఉదయం పంపిణీ చేశారు. ఈ ఏడాది ఈ గణేష్ లడ్డూను వేలంపాట నిర్వహించకుండా గణేష్ ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రసాదం అందించాలని ఉద్దేశంతో నిర్వాహకులు గణేష్ లడ్డు ప్రసాదాన్ని పాకెట్లలో వేసి పంపిణీ చేశారు. మండల కేంద్రంలో దాదాపు 5 వేల ప్యాకెట్లు ప్రతి ఇంటి కుటుంబానికి అందించడంపై గ్రామస్తులంతా అభినందించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad