Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మెగా రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయం  

మెగా రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయం  

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : మెగా రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అని నూడా చైర్మన్ కేశవేణు అన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని నగరంలో గల చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో గల సిద్ధి వినాయక గణేష్ మండలి లక్ష్మీనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని నుడా చైర్మన్ కేశవేణు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంత పద్మనాభ స్వామి అవతారంలో ఏర్పాటు చేసిన ఈ వినాయకుని దర్శించుకోవడానికి నగరం తో పాటు చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు హాజరుకావడం చాలా సంతోషం అన్నారు. అదేవిధంగా తల సేమియాతో బాధపడుతున్న చిన్నపిల్లల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమని అభినందించారు. ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు భవిష్యత్తునలో మరిన్ని కార్యక్రమాలు చేయాలని అందుకు ఎల్లవేళల నా అండ దండలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ నాయకులు బరికుంట శ్రీనివాస్, పిల్లి విజయ్ కుమార్, మణి, సునీల్ మిత్ర, వినయ్, బబ్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad