Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఖైరతాబాద్ బడా గణేశ్​ నిమజ్జనం పూర్తి..వీడియో

ఖైరతాబాద్ బడా గణేశ్​ నిమజ్జనం పూర్తి..వీడియో

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఖైరతాబాద్ బడా గణేశ్​ నిమజ్జనం పూర్తి అయింది. 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు మహాగణపతిని నిమజ్జనం కోసం భారీ టస్కర్ పై ఎక్కించి హుస్సాన్ సాగ‌ర్‌లో నిమ‌జ్జ‌నం చేశారు. గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా అనే నినాదాల‌తో మారుమోగుతున్నాయి.

ఖైరతాబాద్ గణేశుడిని ఎక్కించిన టస్కర్ 26 టైర్లతో 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. వెల్డర్ నాగబాబు ఆధ్వర్యంలో 20 మంది కార్మికులు పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఐరన్ స్తంభాలతో బలమైన బేస్‌ను ఏర్పాటు చేసి, విగ్రహాన్ని సురక్షితంగా హుస్సేన్ సాగర్ తీరంలోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు త‌ర‌లించారు.

ఈ శోభాయాత్ర సెన్సేషన్ ​థియేటర్ ​నుంచి ఇక్బాల్ ​మినార్, సైఫాబాద్​ ఓల్డ్ ​పీఎస్, టెలిఫోన్​ భవన్​, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ​పక్క నుంచి, సెక్రటేరియేట్​ మీదుగా సాగి..ఎన్టీఆర్​ గార్డెన్​ ఎదురుగా ఉన్న నాలుగో నంబర్​ క్రేన్ ​వద్ద నిమజ్జనం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad