- Advertisement -
నవతెలంగాణ- ఖమ్మం: ఖమ్మం నగరానికి చెందిన సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకుడు నర్రా రమేష్ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందారు. మృతదేహాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఉంచారు. మృతదేహాన్ని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రం, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం ఖమ్మంలో ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
- Advertisement -