నవతెలంగాణ – మల్హర్ రావు
ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని మండల ఇంచార్జి ఎంపిడిఓ రామ్మూర్తి కోరారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు శనివారం తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితా మండల ప్రజా పరిషత్ నోటీసు బోర్డుపై ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. ఈ విషయమై చర్చించడం కొరకు ఈనెల 8న సోమవారం ఉదయం 11గంటలకు మండలంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశము ఏర్పాటు చేయడమైనదని పేర్కొన్నారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని కోరారు. సమావేశంలో ఏమైనా అభ్యంతరాలు గాని,మిస్ అయిన గ్రామపచాయితీ, వార్డుల్లో సంబంధించిన వారు రాతపూర్వకంగా ఇవ్వాలని సూచించారు.
ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలపాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES