నవతెలంగాణ – బల్మూరు
బల్మూరు మండల ఓటర్లు పోలింగ్ స్టేషన్లో జాబితాను పబ్లిష్ చేయడం జరిగిందని ఎంపీడీవో రాఘవులు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల సర్కులర్ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎలక్షన్స్ 2025 అనుసరించి శనివారం మండల పరిషత్ కార్యాలయంలో విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీలలో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ కేంద్రాలు మరియు ఓటర్ల జాబితాను ప్రకటించడం జరిగిందని తెలిపారు.
మండలంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 11 ఉన్నాయని ఆరు నుండి 8 వరకు వీటిపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఇదే రోజు మండల స్థాయి మండల స్థాయి రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 9న అభ్యంతరాలు పరిష్కరించడం, పదో తేదీ రోజు పోలింగ్ స్టేషన్లో మరియు ఓటర్ల జాబితా తుది పబ్లికేషన్ చేయబడునని ప్రకటనలో తెలిపారు.
ఓటర్ జాబితా విడుదల: ఎంపీడీవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES