Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్లోక్ అదాలత్ సమావేశం నిర్వహించిన న్యాయమూర్తి 

లోక్ అదాలత్ సమావేశం నిర్వహించిన న్యాయమూర్తి 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ , కామారెడ్డి ఆధ్వర్యంలో శనివారం డా. సూర సుమలత, ఇన్‌చార్జి కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికారం, కామారెడ్డి ఆధ్వర్యంలో, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ డా. సి హెచ్, వి ఆర్ ఆర్, వరప్రసాద్  ఆదేశాల మేరకు, రాబోయే జాతీయ లోకఅదాలత్ (13.09.2025) సందర్భంలో కేసుల పరిష్కారం కోసం, జిల్లా బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో  రూ.50,000  లోపు, రూ.1,00,000  లోపు ఉన్న డిఫాల్టు ఖాతాలను లోకఅదాలత్‌లో పరిష్కరించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అంతేకాక, వీధి వ్యాపారులకు అందజేయబడిన ప్రధాన మంత్రి స్వనిధి రుణాలు సకాలంలో పరిష్కరించకపోతే వారి సిబిల్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడుతుందని, కాబట్టి వాటి విషయంలో కూడా లోకఅదాలత్ ద్వారా సానుకూల పరిష్కారం కావాలని బ్యాంకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ సమావేశంలో ఎస్‌బీఐ ప్రాంతీయ మేనేజర్  ఎం. నరేష్ , ఆర్‌బీఓ కామారెడ్డి ప్రాంతీయ మేనేజర్  ఏ. ప్రవీణ్ కుమార్,  ఇతర బ్యాంకు మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డా. సూరా సుమలత గారు, రాబోయే జాతీయ లోకఅదాలత్ (13.09.2025) ను ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న కేసులను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకొని లాభపడాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad