Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, లబ్ధిదారు పిల్లమరి రజితకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాన్ని అందించారు. అనంతరం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందించడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాలను మహిళల పేరుమీద అందిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన  సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగాజమున, కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న,  పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూకల బుజ్జి మల్లయ్య, నాయకులు సింగిరెడ్డి శేఖర్, సాయి కుమార్ గుప్తా, గణేష్, లబ్ధిదారు కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad