Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కేంద్రమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మిషన్ భగీరథ డిఈ ..

కేంద్రమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మిషన్ భగీరథ డిఈ ..

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
మిషన్ భగీరథ డిఈ హేమలత శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సోషల్ సర్వీస్ అవార్డు అందుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ సోషల్ సర్వీసు కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. విద్యను ఆయుధంగా మార్చుకుంది.అడ్డంకులను అధిగమించింది. మిషన్ భగీరథ పథకం ద్వారా పట్టణాలతోపాటు   నల్లమల్ల అటవీ ప్రాంతంలోని దట్టమైన అడవిలో చెంచులకు తాగునీరు సౌకర్యం కల్పించింది. గిరిజన ఆవాసాలకు స్వచ్ఛమైన నీరును సరఫరా చేయడంలో హేమలత కృషి అభినందనీయం. డిఈ హేమలత శ్రమను గుర్తించిన ప్రభుత్వం సోషల్ సర్వీస్ అవార్డు అందించి అభినందించారు.

అటవీ ప్రాంతంలోని 16 చెంచు పెంటలకు 5.హెచ్ పి సోలార్ మోటార్లు ఏర్పాటు చేసి చెంచు ల దాహం తీర్చారు. అడవి బిడ్డల దశాబ్దాల నీటికోసకు విముక్తి కలిగించారు. శ్రీశైలం ప్రధాన రహదారి నుంచి పరాహాబాద్ కిలోమీటర్లు ఉంటుంది 25 చెంచు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. బస్సు సౌకర్యం లేదు కరెంట్ సౌకర్యం లేదు సోలార్  మోటార్ల ద్వారా చెంచుల దాహం తీర్చింది. నల్లమల్ల టిప్ ప్రాంతంలో మిషన్ భగీరథ పథకాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు గాను శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సోషల్ సర్వీస్ అవార్డు అందుకున్నారు పలువురు ఉద్యోగస్తులు అభినందనలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad