నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని హంగార్గ లో శనివారం నాడు జరిగినటువంటి కాంగ్రెస్ జాయినింగ్ పచ్చి అబద్దం అని ఒక ప్రకటనలో తెలియజేశారు. అందులో వున్నది కేవలం బీజేపీ , బీఅర్ఎస్ వాళ్ళు కేవలం 15 మంది మాత్రమే అందులో బీఆర్ఎస్ వాళ్ళు 4 బీజేపీ వాళ్ళు 11 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు ఇంచార్జ్ శివకుమార్ గౌడ్ విమర్శించారు. మిగతా మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలకు కండువాలు వేసి బీఆర్ఎస్ మరియు బీజేపీ వాళ్ళు అనడం సిగ్గు చేటు ఆరోపించారు. పార్టీలు మారింది లీడర్లు మాత్రమే ఓటర్లు కాదు అని పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మా సత్తా ఎంటో చూపిస్తాం అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అబద్దపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి కండువాలు కప్పిన ఎమ్మేల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES