నవతెలంగాణ – ఆర్మూర్
న్యూఢిల్లీ లోని సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఎస్ ఓ ఎఫ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్న జాతీయ స్థాయి ఒలింపియాడ్ పోటీలలో విశేష ఫలితాలు సాధించినందుకు శ్రీ భాషిత పాఠశాలకు సర్టిఫికెట్ ఆఫ్ అప్రిసియేషన్ గౌరవ పత్రాన్ని అందజేసినట్టు పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ శనివారం తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులను ఇంగ్లీష్, మ్యాస్, సైన్స్, తదితర విషయాలలో ఒలింపియాడ్ పరీక్షలలో పాల్గొనేటట్లు ప్రోత్సహించడం, వారిని పోటీ పరీక్షలకు సంసిద్ధం చేయడంలో చూపిన కృషిని ఎస్ఓఎఫ్ సంస్థ అభినందించిందని తెలిపారు. శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడం పాఠశాల గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ,ప్రిన్సిపల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.