ఒక బస్తా కోసం రెండు రోజులు పడిగపులు
వరసలో నిలబడిన అందని వైనం
నవతెలంగాణ – రామారెడ్డి
రైతులకు యూరియా కష్టాలు కన్నీళ్లను తెస్తున్నాయి. ఒక యూరియా బస్తా కోసం రెండు రోజులు పడిగాపులు కాస్తున్నరు. ఒక రోజు టోకెన్, మరో రోజు యూరియా బస్తా తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వరి పంట పొట్టదశకు రావడంతో మండలంలో ఎక్కడ కూడా యూరియా దొరకకపోవడం, సొసైటీ ద్వారా మాత్రమే అందిస్తుండడంతో, భారీ వరసలో వృద్ధులు, మహిళల రైతులు నిలబడవలసిన పరిస్థితి ఏర్పడింది. దేశానికి అన్నం పెట్టే రైతన్న, ఎరువుల కోసం రోడ్లపై ఇంటిల్లిపాటు నిలబడి అడుక్కునే పరిస్థితి ఏర్పడింది.
పోలీసుల భారీ బందోస్తుమధ్య శనివారం మండల కేంద్రంలో 840 బస్తాల యూరియాకు గాను 1000 నుండి 1200 మంది రైతులు తరలి రావడంతో, వరుసలో నిలబడిన యూరియా అందకపోవడంతో ఆందోళన చెందుతూ వెనుదిరిగారు. ఓట్ల సమయంలో వచ్చే ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతుల ఇబ్బందుల సమయంలో భరోసా కల్పించడానికి ఒక్కరు కూడా రాకపోవడంతో పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం త్వరగా యూరియాను మండలానికి సరఫరా చేసి, పంటకు సరైన సమయంలో ఎరువులు అందేలా రైతులకు యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రైతన్నకు యూరియా కష్టాలు తీరేదేన్నడో ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES