నవతెలంగాణ – కంఠేశ్వర్
లయన్స్ క్లబ్ ఆఫ్ నేత ఆద్వర్యంలో శనివారం నిజామాబాదు నగరంలోని శ్రీ పద్మశాలి ఉన్నత పాఠశాలలోఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన 15 మంది ఉపాద్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాద్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి దీకొండ యాదగిరి,రీజియన్ కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు,అధ్యక్ష కార్యదర్శులు హీరమల్ల విష్ణు,దర్మరాజు,కోశాధికారి రవీందర్, పూర్వాద్యక్షులు పుల్గం హన్మాండ్లు, చింతల గంగాదాస్,పద్మశాలి ఉన్నత పాఠశాల అధ్యక్ష కార్యదర్శులు అవదూత విఠల్,చిలుక వెంకటేష్,లయన్స్ క్లబ్ ఆఫ్ నేత ప్రతినిధులు లింగం,కైరంకొండ మురళి, దేవిదాస్, ధరంవీర్ తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ నేత ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES