Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఏకరూప వస్ర్తాలంకరణ, సన్నాయి మేళంతో నిమజ్జన శోభాయాత్ర

ఏకరూప వస్ర్తాలంకరణ, సన్నాయి మేళంతో నిమజ్జన శోభాయాత్ర

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలానికి చెందిన గ్లోబల్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు  ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయక నిమజ్జన శోభాయాత్రను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నవరాత్రులు భక్తి శ్రద్ధలతో వినాయకుడికి పూజలు చేసి నిమజ్జనం రోజు హిందూ సాంప్రదాయబద్ధంగా కుటుంబ సమేతంగా ఏకరూప వస్త్రాలంకరణ చేసుకొని, సన్నాయి మేళంతో భక్తి శ్రద్ధలతో శోభ యాత్రగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. శోభయాత్రను గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. 

అనంతరం శోభయాత్ర జరుగుతున్న సందర్భంలో కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి యాత్ర సందర్శించి గ్లోబల్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు శ్రవణ్, సాయి కృష్ణ, రంజిత్, కమల్, సంపత్, నవీన్, రాము, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad