Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంజీఎస్‌టి శ్లాబుల నిర్ణ‌యం మాది కాదు: నిర్మలా సీతారామన్‌

జీఎస్‌టి శ్లాబుల నిర్ణ‌యం మాది కాదు: నిర్మలా సీతారామన్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జిఎస్‌టి శ్లాబులు 5, 12,18, 28 శాతంగా ఉండేవి. అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఈ శ్లాబుల విధానం బిజెపి నిర్ణయం కాదని, రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ తీసుకున్నదని శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. నాలుగు శ్లాబుల విధానంపై ప్రతిపక్ష పార్టీలు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆమె శనివారం అన్నారు. నాలుగు శ్లాబుల విధానం కాస్తా.. తాజాగా జరిగిన జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశంలో 5, 18 శాతం శ్లాబులకి తగ్గిస్తూ.. గతంలో ఉన్న 12, 28 శాతం శ్లాబులను తొలగిస్తూ ఈ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. ఈ శ్లాబులు సెప్టెంబర్‌ 22 నుంచి అమల్లోకి రానుంది. తాజాగా ఈ విషయంపై నిర్మలా సీతారామన్‌ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సామాన్యులపై దృష్టిసారించి సంస్కరణలు చేపట్టాము. సామాన్యుడు వినియోగించే వస్తువులపై విధించే పన్నుపై సమీక్షించాము. ఈ సంస్కరణల వల్ల రేట్లు బాగా తగ్గనున్నాయి’ అని ఆమె అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad