రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి 4 వేల మంది అమరులయ్యారు
సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లీం పోరాటంగా వక్రీకరిస్తున్న బీజేపీ
ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ అధికారం కోసం నచ్చని ఓట్ల తొలగింపు
బీహార్‌లో బీజేపీకి గుణపాఠం తప్పదు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ -హయత్ నగర్
‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపిన కమ్యూనిస్టులు నిజాం ప్రభువు, భూస్వాములు, జాగీర్దార్ల ఆధీనంలో ఉన్న భూముల్ని స్వాధినం చేసుకుని 10 లక్షల ఎకరాలను పేద ప్రజలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులది. భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా 1946 నుంచి 1951 వరకు ఎర్రజెండా నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో 4వేల మంది అమరులయ్యారు. వేలాది గ్రామాలు నిజాం నవాబు పాలన నుంచి విముక్తి పొందాయి. అలాంటి మహోత్తరమైన ప్రజాపోరాటంతో ఎలాంటి సంబంధంలేని.. బీజేపీ హిందూ ముస్లీం పోరా టంగా చిత్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది’ అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లాలోని మన్సూరాబాద్‌లోని ఎంఈ రెడ్డి పంక్షన్ హాల్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ”వీర తెలంగాణ సాయుధ పోరాటం-వక్రీకరణలు” ఆంశంపై సదుస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. నిజాం పాలనలో తెలం గాణ పరగణంతా వెట్టి నడిచేదని, భూస్వాములు, పెత్తందార్లు, పటేల్ పట్వారీ లకు లొంగి పనిచేయాల్సిన దుస్థితి ఉండేదన్నారు.
దుర్భర పరిస్థితి నుంచి విముక్తి కల్గించి, ప్రజల్ని కాపాడేందుకు 1930లో ఆంధ్రమహాసభ పేరుతో కమ్యూనిస్టులు ప్రజల ముందుకొచ్చారని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ ఐదెక రాల పంటను భూస్వామ్య గుండాలు ఎత్తుకెళ్లేందుకు పూనుకుంటే భీంరెడ్డి నర్సింహారెడ్డి దళం ఆ పంటను రక్షించి భూస్వామ్య గుండాలను ఎదిరించిన విషయాలను ఆయన వివరించారు. దొడ్డి కొమరయ్య బలిదానం తర్వాత సాయుధ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగిందని, బాంచన్ కాల్మొక్త అన్న ప్రజలు బంధూకులు పట్టి పోరాటంలోకి దూకారని తెలిపారు. సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న సీపీఐ(ఎం) ప్రజా సమస్యలపై పోరాడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరిని ఉద్యమాలు నడిపేందుకు పార్టీ శ్రేణులు సిద్దం కావాలని కోరారు. ప్రపంచ చరిత్రలో గుర్తింపు పొందిన ప్రజా పోరాటమైన సాయుధ పోరుతో ఏలాంటి సంబంధంలేని బీజేపీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లీం పోరాటంగా వక్రీకరిస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తూ బీహార్‌లో అధికారం కోసం 65 లక్షల ఓటర్ల పేర్లను తొలగించిన బీజేపీ రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటు రూపంలోనే గుణ పాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ఓట్ చోరిపై చర్చ జరుగుతుందన్నారు. విపక్ష ప్రభుత్వాలను పడగొట్టి దొడ్డిదారిలో అధికారం చేపడుతున్న బీజేపీ రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తుందన్నారు. సాయుధ పోరాట స్పూర్తిని కొనసాగిస్తామంటూ అక్కడికి వచ్చిన ప్రజలతో ప్రతిజ్ఞ చే యించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చంద్రమోహన్, జిల్లా కమిటీ సభ్యులు కీసరి నర్సిరెడ్డి, సరూర్‌నగర్ సర్కిల్ కార్యదర్శి సీహెచ్ వెంకన్న, నాయకులు వీరయ్య, శ్రీనివాస్, యాదిరెడ్డి, మల్లేశం, కృష్ణయ్య, గణేష్, సంధ్య, బాస్కర్, రామస్వామి, అనిల్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
పేదలకు 10 లక్షల ఎకరాల భూమి పంచింది కమ్యూనిస్టులే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES