- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, యాదాద్రి, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అటు ఏపీలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
- Advertisement -