నవతెలంగాణ-హైదరాబాద్ : బతుకమ్మ పండుగ సమీపిస్తున్న వేళ మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ‘అక్క-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరిట చేనేత చీరల పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక్కో మహిళకు రెండేసి చీరలు ఇవ్వాలని యోచిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులో సభ్యులైన ప్రతి మహిళలకు ఒక చీర ఇచ్చేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు రెండేసి చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. మెప్మా ద్వారా నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలోని సభ్యుల వివరాలు, డీఆర్డీవో ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని సభ్యుల వివరాలు సేకరించేంచాలని పీడీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీ నాటికి జిల్లాకు చేరనున్నాయి.
బతుకమ్మ పండుగకు మీ రేవంతన్న కానుక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES