Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పంట నష్టపరిహారాన్ని అందించాలని ధర్నా

పంట నష్టపరిహారాన్ని అందించాలని ధర్నా

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండల పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసిల్దార్ శ్రావణ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. నష్టపోయిన రైతులకు సోయా పంటకు రూ.70 వేలు, మరి పంటకు రూ.50 వేల నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. రైతు బీమా చేయడానికి బ్యాంకుకు వెళితే వారు నిరాకరిస్తున్నారని, రైతులకు రైతు బీమా సౌకర్యం కల్పించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర నాయకులు పుట్టి నడిపి నాగన్న, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పార్వతి రాజేశ్వర్, మండల కార్యదర్శి ఎస్కె నసీర్, వడ్డన్న, పెద్దులు, సిద్ధ పోశెట్టి, జబ్బార్, మన్నె పోశెట్టి, సాకలి సాయిలు, సుదర్శన్ గౌడ్, తరుణ్, లక్ష్మణ్ శివాజీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad