Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్స్పీడ్ లేజర్ గన్స్ ను ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ  

స్పీడ్ లేజర్ గన్స్ ను ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ  

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న భద్రతా చర్యలు, కట్టుదిట్టమైన నిబంధనల అమలు ఫలితంగా ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని కలెక్టర్, ఎస్సీ అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 2024 ఆగస్టు వరకు జిల్లాలో మొత్తం 188 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా.. 2025 ఆగస్టు వరకు వాటిని 145కి తగ్గించగలిగామన్నారు. దీని ద్వారా మొత్తం 22.9% తగ్గుదల నమోదైందని, అదేవిధంగా మరణాలు 197 నుండి 153కి తగ్గి 22.3% తగ్గిందని తెలిపారు. అలాగే గాయపడ్డ కేసులు కూడా  181 నుండి 173కి పడిపోయాయని తెలిపారు. గాయపడిన వ్యక్తులు 355 నుండి 298కి తగ్గడం ద్వారా రోడ్డు ప్రమాదాల నియంత్రణలో గణనీయమైన తగ్గుదల నమోదైందని వివరించారు.

జిల్లా స్థాయిలో రోడ్డు భద్రతా చర్యల విజయాన్ని సూచిస్తూ, ప్రజల ప్రాణ రక్షణలో ఒక గొప్ప ముందడుగుగా నిలిచిందన్నారు. రోడ్డు ప్రమాదాల తగ్గుదలకు ప్రధాన కారణాలు
– ప్రతిరోజూ వాహన తనిఖీలు,  డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్‌లు, హెల్మెట్ & లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అతివేగంగా ప్రయాణించే వారిపై జరిమానాలు విధిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా, సోమవారం జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్ జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్  సదాశివనగర్, ఎన్‌హెచ్-44 వద్ద అయ్యప్ప ఆలయం సమీపంలో స్పీడ్ లేజర్ గన్స్ ను ప్రారంభించారు.

జిల్లాలో మొత్తం మూడు స్పీడ్ లేజర్ గన్స్ వాహనదారుల  వేగాన్ని నియంత్రించడం కొరకు పనిచేస్తున్నవని, అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి జరిమానాలు విధించి క్రమంగా వారి వాహణముల వేగనియంత్రణ చేయడం, తద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన ఉద్దేశమని వారు తెలిపారు. ఇకపై ఈ లేజర్ గన్స్ జాతీయ రహదారి (NH-44), జాతీయ రహదారి (NH-161), రాష్ట్ర రహదారులపై ఉంటాయని అన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా మీ ప్రాణాన్ని, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోండి అని జిల్లా పోలీసు శాఖ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని స్పష్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad