- Advertisement -
ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్
నవతెలంగాణ – నసురుల్లాబాద్.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 1, 2025 ఆధారంగా చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు పూర్తి సహకారం అందించాలని నసురుల్లాబాద్ ఎంపీడీవో రవి ఈశ్వర్ గౌడ్ తెలిపారు. సోమవారం నసురుల్లాబాద్ మండల సమీకృత కార్యాలయంలో వివిధ పార్టీల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, ఇంటిపేరు చేర్పు వంటి అంశాలపై చర్చించారు. మండల పరిధి ప్రజాప్రతినిధులు నాయకులు ఓటర్ల సవరణ జాబితా పై ప్రఒక్కరుక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, తదితర పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.
- Advertisement -