ఆ పోరాటం నేటి తరానికి ఆదర్శం : ఎన్‌పీఆర్‌డీ సదస్సులో ఐద్వా ఉపాధ్యక్షులు టి జ్యోతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ వైఖరిని తిప్పికొట్టాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు టి జ్యోతి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్‌పీఆర్‌డీ కార్యాల యంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 79వ వార్షికోత్సవం సందర్బంగా ‘తెలంగాణ సాయుధ పోరాటం వాస్తవాలు-వక్రీకరణలు’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేటి తరానికి ఆదర్శమని చెప్పారు. ఆ పోరాటంతో సంబంధంలేని బీజేపీ మత కలహాలకు ఆజ్యం పోసే విధంగా మాట్లాడుతున్నదని చెప్పారు. చరిత్రకు వక్రభాష్యాలు చెబుతున్నదన్నారు. కుల, మత, ప్రాంతాల మధ్య వైషమ్యాలను పెంచి తమ రాజకీయ పబ్బం గడుపుకు నేందుకు చూస్తున్నదని విమర్శించారు. వాస్తవంగా ఆనాడు నైజాం నవాబ్ నిరంకు శత్వానికి వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుండి విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాటం జరిగిందని చెప్పారు. ప్రజలపై దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా జరిగిన ఆ పోరాటం చారిత్రాత్మకమైందని తెలిపారు. దొడ్డి కొమురయ్య అమరత్వంతో ప్రజలు సాయుధ పోరాటాన్ని ఉధృతం చేశారని చెప్పారు. ఆ పోరాటం ద్వారా 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచిందని చెప్పారు. నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
గ్రామాల్లో స్వయం పాలన ఏర్పాటు చేసుకు న్నారని తెలిపారు. ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య మాట్లాడుతూ వికలాంగుల పింఛన్‌ను పెంచకుండా 20నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వం వికలాం గులను మోసం చేస్తున్నదని విమర్శిం చారు. పింఛన్ పెంపు కోసం దశల వారీగా ఉద్యమం చేస్తామని హేచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వికలాం గులకు రూ.300 పింఛన్ ఇస్తుంటే మందకృష్ణ ఎందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. వచ్చే నెల 25,26 తేదీల్లో హైదరాబాద్‌లో ఎన్‌పీఆర్‌డీ జాతీయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 25న విద్యా, ఉపాధి, సంక్షేమం, సాదికారత అంశాలపై జాతీయ సదస్సు నిర్వహిం చనున్నట్టు చెప్పారు. సదస్సులో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్, కోశాధికారి ఆర్ వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉపేందర్, కాషప్ప, మధుబాబు, అరిఫా, సహాయ కార్యదర్శులు జె రాజు, నాగలక్ష్మి, గంగాధర్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం నర్సింహులు, నగేష్, రాధమ్మ, భాగ్యలక్ష్మి, మంగమ్మ, వి వెంకన్న, గైని రాములు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.