- Advertisement -
- మంత్రి పియూష్ గోయల్
న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) తగ్గింపు ప్రయోజనాలను తప్పనిసరిగా వినియోగదారులకు చేర్చాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఇఇపిసి ఇండియా ప్లాటినం జూబ్లీ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఐటి మంత్రి జితిన్ ప్రసాద, మంత్రి పియూష్ గోయల్ హాజరయ్యారు. ఈ సందర్బంగా పియూష్ మాట్లాడుతూ.. జిఎస్‌టి శ్లాబుల తగ్గింపు పరిశ్రమలు, వాణిజ్యాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. జిఎస్‌టి శ్లాబుల తగ్గింపు చాలా విస్తృతమైందని అభివర్ణించారు. సరళీకరణ, రేటు తగ్గింపులతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకు సాగుతుందన్నారు. కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రజలు ఎక్కువ ఖర్చు చేస్తారని, జిఎస్‌టి రేటు తగ్గింపుల ప్రయోజనాలు వినియోగదారులకు చేరేలా చూడాలన్నారు. జిఎస్‌టి శ్లాబులను 5 శాతం, 18 శాతానికి కుదించిన విషయం తెలిసిందే.
- Advertisement -