పరిశ్రమ రక్షణకు సీఐటీయూ నికర పోరాటాలు
డిసెంబర్‌లో జరిగే రాష్ట్ర మహాసభలో పోరాటాల రూపకల్పన : తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు కాముని గోపాలస్వామి
నవతెలంగాణ-నిజాంపేట
కేంద్రం తప్పుడు విధానాలే బీడీ పరిశ్రమ సంక్షోభానికి కారణమని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు కాముని గోపాలస్వామి అన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమ రక్షణపై డిసెంబర్‌లో మెదక్‌లో జరిగే మహాసభల్లో చర్చించనున్నట్టు తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర మహాసభల సందర్భంగా ‘బీడీ పరిశ్రమ పరిరక్షణ, కార్మికుల పాత్ర’ అంశంపై మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రం లో సోమవారం సెమినార్ నిర్వహించారు. బీడీ కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి బాలమణి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్‌లో గోపాలస్వామి మాట్లా డుతూ.. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధా నాల ఫలితంగానే బీడీ పరిశ్రమ కుదేలై లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారన్నా రు. జీఎస్టీ పేరుతో బీడీ పరిశ్రమను ప్రణాళికాబద్ధంగానే దెబ్బ తీసి మినీ సిగరెట్ పరిశ్రమలకు పరోక్షంగా సహకరి స్తుందని తెలిపారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమలు దెబ్బ తీసి కార్పొరేట్లకు ఊడిగం చేసే పనిలో ఉందని విమర్శించారు. జీఎస్టీ విధించడం, పుర్రె గుర్తు సైజు పెంచడం, తునికాకు సేకరణపై అటవీ శాఖ ఆంక్షలను సాకుగా చూపి బీడీ కార్మికులకు ప్రస్తుతం ఇచ్చే హక్కుల్లో కోత విధించడం యాజమాన్యాలకు సాకుగా మారింద న్నారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వమూ బీడీ కార్మికులపై కపట ప్రేమ చూపుతోం దన్నారు. కనీస వేతనం పెంచకపోవడం, కొత్త వారికి జీవన భృతి మంజూరు చేయకపోవడం, ప్రస్తుతం ఉన్నదాన్ని పెంచడం కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు తప్ప వేరే మార్గం లేదన్నారు. కార్మిక పోరాటాల సారథిó సీఐటీయూ రాష్ట్ర మహాసభల జయప్రదానికి బీడీ కార్మికులు కృషి చేయాలని, అన్ని తరగతుల వారూ సహకరించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో టేకిదారుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిద్దిరాములు, జిల్లా అధ్యక్షులు నారాయణ, సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం, నిజాంపేట మండల నాయకులు నీలం బాబు, బీడీ కార్మికులు పాల్గొన్నారు.
కేంద్రం తప్పుడు విధానాలే బీడీ పరిశ్రమ సంక్షోభానికి కారణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES