నవతెలంగాణ-హైదరాబాద్ : మెదక్ జిల్లాలో పెను ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్ పేలి ఓ భవనం కుప్పకూలింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముత్రాజ్‌పల్లి గ్రామంలో గ్యాస్ లీక్ కావడం జరిగింది. దీంతో ఏం చేయాలో తెలియక బయటికి పరుగులు తీశారు ఆ కుటుంబ సభ్యులు.
అయితే..ఆ కుటుంబ సభ్యులు బయటకు వచ్చిన కాసేపటికి సిలిండర్ పేలింది. ఈ తరుణంలోనే….ఇల్లు కుప్పకూలింది. దీనికి సంబంధించిన విజువల్ పక్కింటి సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇక ఈ సంఘటనపై ఆ బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేసుకున్నారు పోలీసులు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.