- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ సైన్యం బహుళ అంతస్తుల్ని లక్ష్యం చేసుకుని దాడులకి పాల్పడుతోంది. సోమవారం 12 అంతస్తుల భవనంపై బాంబు దాడి చేసింది. సోమవారం గాజా అంతటా జరిపిన దాడుల వల్ల గడచిన 24 గంటల్లోనే 65 మంది మృతి చెందారని, 320 మంది గాయాలపాలయ్యారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
కాగా, గత కొన్నిరోజులుగా ఇజ్రాయిల్ సైన్యం బహుళ అంతస్తులపై దాడికి పాల్పడింది. హమాస్ ఈ భవనాల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుందనే అనుమానంతోనే ఇజ్రాయిల్ సైన్యం బహుళ భవనాలపై బాంబు దాడికి పాల్పడింది. గాజానగరంలోని ఉన్న ప్రజలను తక్షణమే ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ బెదిరిస్తోంది.
- Advertisement -