నవతెలంగాణ-హైదరాబాద్:
నవతెలంగాణ-హైదరాబాద్: స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ప్రయాణిస్తున్న సహాయ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. గాజాలో మానవతాసాయం అందించేందుకు గ్రెటా థన్‌బర్గ్‌తో పాటు 44 దేశాలకు చెందిన పౌరులను తీసుకెళ్తున్న నౌకపై ట్యునీషియా తీరంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో గ్రెటాతోపాటూ అందులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగానే ఉన్నట్లు తెలిసింది.
జీఎస్‌ఎఫ్ కూడీ ఈ దాడిని ధ్రువీకరించింది. పోర్చుగీస్ జెండా కలిగి, ఫ్లోటిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులతో వెళ్తున్న నౌకపై డ్రోన్ దాడి జరిగినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, నౌకపై డ్రోన్ దాడి వాదనను ట్యునీషియా అధికారులు ఖండించారు. డ్రోన్ దాడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని తెలిపారు. నౌక లోపలి నుంచే పేలుడు సంభవించిందని నేషనల్ గార్డ్ ప్రతినిధి వెల్లడించారు.