నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతి గా గెలవాలని కోరుకుంటున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేక ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపిన అభ్యర్థి గెలవాలని కోరుకోవడం సానుకూల ప్రాంతీయ వాదం అవుతుందన్నారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డకు అవకాశం వచ్చిందని, సుదర్శన్ రెడ్డి గెలిస్తే వైస్ ప్రెసిడెంట్ పదవికి వన్నెతెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల్లో మాట్లాడిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతిలో గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్నారు. మేమంతా అంతర్గతంగా చర్చించుకున్నాం. తెలంగాణలో ఉన్నతమైన ఆశయాలు, లక్ష్యంతో అడుగు వేయాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. అయితే ఇవాళ జరుగుతున్న ఉప రాష్ట్రపతి పోలింగ్ కు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉన్న నేపథ్యంలో కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇంట్రెస్టింగ్ గా మారాయి.
సుదర్శన్ రెడ్డి గెలిస్తే వైస్ ప్రెసిడెంట్ పదవికి వన్నెతెస్తారు : కవిత
- Advertisement -
- Advertisement -