Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమద్యం అమ్మితే రూ.5 లక్షల ఫైన్..!

మద్యం అమ్మితే రూ.5 లక్షల ఫైన్..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన చెందిన ఆ గ్రామ ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే ఏకంగా రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గిరిగేట్‌పల్లి గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆ గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. మద్యం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని, ఇంట్లో ప్రశాంతత కరవవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నెలకొన్న ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.

ఇకపై గ్రామంలో ఎవరూ మద్యం అమ్మకూడదని, కొనుగోలు చేయకూడదని గ్రామస్థులు ముక్తకంఠంతో తీర్మానం చేశారు. ఈ నిర్ణయాన్ని అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, వారికి రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad