తెలంగాణ భాషా పరిరక్షణకు, ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయం అని ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు. కాళోజీ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు మరువలేనివని, తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనీకుడు కాళోజీ నారాయణ రావు అన్నారు. తెలంగాణ భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన కవితల ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడుగా అభివర్ణించారు. భారత దేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తో సన్మానింపబడిన ప్రజాకవి కాళోజీ గారి స్ఫూర్తిని ప్రజలు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్.ఐ లు మధుకర్, యాదగిరి, సి.ఐ మధుకర్, కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలు చిరస్మరణీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES