Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత

జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత

- Advertisement -

మొక్కలు మానవ మనుగడకు ఎంతో దోహదపడతాయి
వర్షాలు కురవాలంటే మొక్కలు నాటాల్సిందే
ఎఫర్ట్ సంస్థ జిల్లా ప్రతినిధి రమేష్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

జీవ వైవిద్య పరిరక్షణ ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని ఎఫెక సంస్థ మహబూబాద్ జిల్లా ప్రతినిధి రమేష్ నెల్లికుదురు మండల ప్రతినిధి వంగాల రవీందర్ అన్నారు. మండలంలోని రాజుల కొత్తపల్లి ఎర్రబెల్లి గూడెం గ్రామాలలో ఐటిసి ఎం ఎస్ కె భద్రాచలం వారి సహకారంతో ఎఫర్ట్ సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ చెట్లు పెరగడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గి స్వచ్ఛమైన పర్యావరణం, వాతావరణం ఏర్పడితుంది అని  అన్నారు. చెట్లు మానవ మనుగడకు దోహదం పడుతాయని, lఅడవులతోనే ప్రకృతి సమతుల్యత సాధ్యమని ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరం తీసుకోవాలన్నారు.

ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య పర్యావరణం పరిరక్షణ అని తెలిపారు .ఇది ప్రభుత్వం, ఆయా శాఖల బాధ్యత మాత్రమే కాదని,ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజలను భాగస్వామ్యం చేయ్యాలి అని ఆయన కోరారు. పెట్టిన ప్రతి చెట్టు బతికించాలి,అదే ప్రజల ముందు ఉన్న పెద్ద కర్తవ్యం అని రేపటి తరాలకు ఎదో ఇవ్వాలని అనుకుంటాం కానీ చెట్లు ఇవ్వాలి ఆక్సిజన్ ఇవ్వాలి అని మానవాళి భవిష్యత్ కూడా మొక్కల పెంపకం చాలా కీలకం అని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని  తెలిపారు.

చెట్లు మానవ మనుగడకు దోహదం చేస్తున్నాయని, వర్షాలు సంవృద్దిగా కురావలంటే చెట్లు,అడవులు పెంచాలని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు చిన్నతనం నుండే మొక్కల యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ పెంచాలని అన్నారు అనంతరం ఎర్రబెల్లి గూడెం గ్రామ పరిధిలో పండ్ల మొక్కల పెంపకం కార్యక్రమంలో భాగంగా మామిడి జామ పనస మొక్కలను నాటడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ మండల ప్రతినిధులు  వంగాల రవీందర్, గ్రామ  ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు ఎండి ఇస్మాయిల్, మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు గ్రామ పంచాయతీ సిబ్బందితదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad