- Advertisement -
చైర్మెన్ గుత్తా, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
శాసనసభ ప్రాంగణములోని శాసనమండలి భవనం (హెరిటేజ్ బిల్డింగ్) పునర్నిర్మాణ పనులను మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి డిప్యూటీ చైర్మెన్ బండా ప్రకాష్ ముదిరాజ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహా చార్యులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ భవన పునర్నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆర్ అండ్‌బీ అధికారులు, అగాఖాన్ సంస్థ ప్రతినిధులతో వారు మాట్లాడారు.
- Advertisement -