పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఈనెల 12,13 తేదీల్లో షాద్‌నగర్ గిరిజన గురుకుల డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాలలో కృత్రిమ మేధా (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై రెండు రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో సచివాలయంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్‌తో కలిసి మంత్రి అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సదస్సులో గిరిజన సంక్షేమ కార్యదర్శి సీతాలక్ష్మి, అడిషనల్ సెక్రటరీ పి.మాధవిదేవి, డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ కే.వేణుగోపాల్, గిరిజన గురుకుల ఓఎస్డీ నటరాజ్ తదితరులు పాల్గొంటారని షాద్‌నగర్ గిరిజన గురుకుల డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నీతా తెలిపారు.