Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంక్యాన్సర్‌.. ప్రాణాంతకం

క్యాన్సర్‌.. ప్రాణాంతకం

- Advertisement -

రాష్ట్రంలో 34 క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్లు ఏర్పాటు
సంవత్సరానికి 55 వేల కేసులు నమోదు
పేదలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు
నర్సింగ్‌ విద్యార్థులు ఇంగ్లీష్‌పై పట్టు సాధించేలా కృషి
జర్మనీ, జపాన్‌ కొలబ్రేషన్‌తో ఎంఓయూ : వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ


నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
క్యాన్సర్‌ ప్రాణాంతక వ్యాధి అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలోని 34 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్లను మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కాలేజీ నుంచి వర్చువల్‌గా మంత్రి దామోదర్‌ ప్రారం భించారు. అలాగే, రాష్ట్రంలోని నర్సింగ్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులు జర్మనీ, జపాన్‌లాంటి విదేశాల్లో ఉద్యోగాలు పొం దేందుకు వీలుగా ఇంగ్లీష్‌పై పట్టు సాధించేలా ఇప్లూ(ఇంగ్లీష్‌ ఫారిన్‌) యూని వర్శిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రాణాంతక మైన క్యాన్సర్‌ వ్యాధిని నివారించడం కోసం సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందిం చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. క్యాన్సర్‌పై గ్రామీణ ప్రాంతాల వారికి అవగాహన లేక సమయానికి చికిత్స తీసుకోవడం లేదని, దాంతో చికిత్స తీసుకునేందుకు వచ్చే సమయానికి రెండో దశ, మూడో దశ దాటిపోతుంద న్నారు. క్యాన్సర్‌ వ్యాధిని నివారించడం కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కొక్క కేర్‌ సెంటర్‌లో 20 బెడ్లు ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఏడాది రాష్ట్రంలో 55 వేల మంది క్యాన్సర్‌ వ్యాధి బారిన పడుతున్నారని, వచ్చే సంవత్సరంలో అది 75 వేల వరకు వెళ్లే అవకాశం ఉంద న్నారు. క్యాన్సర్‌కు చికిత్స పొందాలంటే రాష్ట్రంలో జేఎన్‌జీ, నిమ్స్‌లో మాత్రమే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్‌పై పోరాడిన నూరి దత్తాత్రేయను సలహా దారులుగా ప్రభుత్వం నియమించిందని తెలిపారు. అదేవిధంగా ప్రతి జిల్లాకు ఒక మొబైల్‌ స్క్రీనింగ్‌ వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ వాహనాలు ప్రతి గ్రామానికి వెళ్లి క్యాన్సర్‌ పరీక్షలు చేసి నిర్ధారణ చేస్తాయని వివరించారు.

నర్సింగ్‌ విద్యార్థులకు ఫారిన్‌ లాంగ్వేజీలో విద్యా బోధన
రాష్ట్రంలోని నర్సింగ్‌ కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఫారిన్‌ లాంగ్వేజీలో విద్యా బోధన చేయనున్నట్టు మంత్రి దామోదర్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 3 వేల మంది నర్సింగ్‌ విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని, ఇప్పటి వరకు రాష్ట్రంలో లక్షా 70 వేల మంది రిజిస్టర్ట్‌ నర్సులు ఉన్నారని తెలిపారు. నర్సింగ్‌ విద్యార్థులకు విదేశీ భాషలయిన జర్మనీ, ఇంగ్లీష్‌ భాషలతో సహా పలు భాషల్లో శిక్షణ ఇవ్వడం కోసం ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్ల్యూ)తో వైద్యారోగ్యశాఖ ఒప్పందం చేసుకుందన్నారు. ఈ శిక్షణతో నర్సింగ్‌ విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జడ్చోంగ్తా, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌, హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర కుమార్‌, అడిషనల్‌ డీఎంఈ డాక్టర్‌ వాణి, ఎంఎన్‌జే కాన్సర్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్‌ పి.ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, వైద్య కళాశాల అధ్యాపకులు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, వైద్యులు, నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad