Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ అవార్డు పొందినా గ్రామంలో అపరిశుభ్రం

ఉత్తమ అవార్డు పొందినా గ్రామంలో అపరిశుభ్రం

- Advertisement -

నవతెలంగాణ-నవాబ్ పేట : మండల పరిధిలోని చౌడూరు పంచాయతీకి ఉత్తమ అవార్డు పొందినా ఆ గ్రామంలోని వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని రోడ్డుపైనే మురికి నీరు పారుతుందని ఆ గ్రామస్తులు అంటున్నారు. పారిశుధ్య పనులపై పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని అంటున్నారు. గత రెండు నెలల్లో చాలా మందికి సీజనల్ వ్యాదులు అంటురోగాల బారిన పడుతున్నా తమ గ్రామంపై అధికారులు చిన్న చూపు చూస్తున్నారు అని చెబుతున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు అని దోమలు, ఈగలతో సీజనల్ వ్యాదులు డెంగ్యూ మలేరియా చికున్ గున్యా వైరల్ ఫీవర్ ప్రభావంతో ప్రజలు సతమతమవుతున్నారని వెంటనే సంబందించిన అధికారులు చొరవ తీసుకొని వ్యాదుల ప్రబలకుండా చర్యలు చేపటచటాలని కోరుకుంటున్నారు.పంచాయతీ కార్యదర్శి ఉత్తమ అవార్డు పొందారు అని పై అధికారులకు ఫిర్యాదు చేస్తే బాగుండదని గొప్ప మనసుతో సతమతమవుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad