సొసైటీ జాతీయ సభ్యుడు బండి రాజయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
సామాజిక నిస్వార్డ సేవకార్యకర్త,ప్రభుత్వ ఉపాధ్యాయుడు లింగమల్ల శంకరయ్యను తన పూర్వ పాఠశాలకు తీసుకోవాలని ఆల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 జాతీయ నాయకుడు బండి రాజయ్య జిల్లా ఉన్నతాధికారులను కోరారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శంకరయ్య ఎలాంటి తప్పు చేయకున్నా, అదే పాఠశాలలో పనిచేస్తున్న కొద్ది మంది ఉపాధ్యాయులు కుట్ర పూరితంగా, కావాలని పాఠశాల విద్యార్థులకు, గ్రామ ప్రజలకు మాయ మాటలు చెప్పి కృత్రిమ ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు చేయించి, వార్తా పత్రికలో, మీడియాలో వైరల్ చేయించటం జరిగిందన్నారు.
ఉన్నతాధికారులు వాస్తవాలు తెలుసుకోకుండా,ఎలాంటి విచారణ చేయకుండా సస్పెండ్ చేసి, తిరిగి డిప్యూటేషన్ పై సుదూర ప్రాంతానికి పంపించడం జరిగిందని తెలిపారు. ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టి ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు చేయించిన అసలైన నిందితులు అదే పాఠశాలలో పనిచేస్తున్న రోహిన్ కుమార్, వినోద్, సమ్మయ్యలను, వారిని ప్రోత్సహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అసలు కారకులను వదిలేసి చట్ట పరిధిలో న్యాయ ఫోరాటం చేస్తున్న లింగమల్లను సస్పెండ్ చేయటం బాధాకరమన్నారు. సస్పెండ్ పై విచారణ పూర్తి చేసి వారంలో రిపోర్ట్ సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ విచారణ పూర్తి కాకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పునరాలోచించి శంకరయ్యను తన పూర్వ గ్రామం నిట్టూర్ ప్రభుత్వ పాఠశాలకు పిజంపించాలని విజ్ఞప్తి చేశారు.
లింగమల్ల శంకరయ్యను వెంటనే తన పూర్వ పాఠశాలకు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES