Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు 

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు 

- Advertisement -

బీఆర్ఎస్ పట్టణ యువజన అధ్యక్షుడు సూర్యవంశం గిరి 
నవతెలంగాణ – వనపర్తి

టి జి పి ఎస్ సి ప్రభుత్వం పైన హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి ఇకనైనా ప్రభుత్వం మానుకోవాలని బి ఆర్ ఎస్ వనపర్తి పట్టణ యువజన అధ్యక్షుడు సూర్యవంశం గిరి అన్నారు. స్థానిక టిఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యవంశం గిరి మాట్లాడారు. విద్యార్థులు నిరుద్యోగులు, ఉద్యోగాల పట్ల పట్టణాలకు వలస వెళ్లి వివిధ ఇనిస్ట్యూట్ లలో కోచింగ్ తీసుకొని సరైన సమయంలో ఉపాధి లభించక అనేక అవస్థలు పడుతున్నారన్నారు. ఈ గ్రూపు ఉద్యోగాలను మూల్యాంకన పద్ధతిలో కమిషన్ పరస్పరం విడ్డూరంగా వ్యవహరించిందన్నారు. మూల్యాంకనంలో రెండు మూడు పద్ధతులను అనుసరించాల్సిన విధానాన్ని ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే పొరపాట్లు జరిగాయని హైకోర్టు గ్రహించిందన్నారు. మూల్యాంకనంలో మాడులేషన్ను అనుసరించక అసమానతకు దారి తీసింది అన్నారు.

ఇది రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడం అవుతుందని, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే నిరుద్యోగుల పక్షాన ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బి ఆర్ ఎస్ వి వనపర్తి జిల్లా అధ్యక్షుడు హేమంత్ ముదిరాజ్ మాట్లాడుతూ గ్రూప్ వన్ నిర్వహణపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం ప్రభుత్వ తీరుకు నిదర్శనం అన్నారు. బిఆర్ఎస్ పదేళ్ల ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జాబ్ అలైన్మెంట్తో రెండు సంవత్సరాలు వ్యవధి గడిచిందన్నారు. మనకున్న ఏడు సంవత్సరాలలో రూ.1,63 వేల ఉద్యోగాలను భర్తీ చేశారని తెలిపారు. వెనువెంటనే కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వం ఊరట కలిగించిందన్నారు. అలాగే 2023 సంవత్సరంలో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఆ ఉద్యోగాలను తాత్కాలికంగా నిలిపివేసిందన్నారు. ఆ ఎలక్షన్ సమయంలోనే ఈ కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు యూత్ డిక్లరేషన్ పేరిట అవాక్కులు చవాక్కులు పలికిందని, తీరా చూసుకుంటే గడిచిన 21 నెలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5000 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని ఎద్దేవ చేశారు.

గ్రూప్ వన్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు కీలకతీర్పు వెల్లడించిందని, గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని టిజిపిఎస్సి కి ఆదేశించిందన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోని 40000 ఉద్యోగాలకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మేమే ఇచ్చినం అనే విధంగా ఈ ప్రభుత్వ వైఖరి ఉందని, అది సరైనది కాదన్నారు. యావత్ విద్యార్థి లోకం నిరుద్యోగుల పక్షాన నిలిచి యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగ యువతను మోసం చేసినందుకు క్షమాపణ తెలియజేయాల్సిందేనన్నారు.  టీజీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షను పునర్నిర్వహించండి లేదా రివాల్యుయేషన్ అయినా పెట్టాలన్నారు. ఇప్పటికీ వారి మోసాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసనలకు ధర్నాలకు బిఆరెస్వీ ముందుకు వస్తుందన్నారు.

  ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ శేఖర్, మైనార్టీ అధ్యక్షుడు జోహేబ్ హుస్సేన్, మండల అధ్యక్షుడు చిట్యాల రాము, గాలిగల్ల క్రాంతి, నాగరాజు , కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad