జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి రజిని
నవతెలంగాణ – వనపర్తి
డిజిటల్ అరెస్టులు మోసపూరితమని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి రజిని అన్నారు. వనపర్తి జిల్లాలోని పానగల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి రజని విద్యార్థులకు బాల్య వివాహాల నిషేధ చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, మోటార్ వాహనాల చట్టం, ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం, ఫోక్సో చట్టం, సైబర్ క్రైమ్స్, డ్రగ్ అబ్యూస్ గురించి అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సలహాల కోసం నల్సా 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చని తెలియజేశారు. కార్యక్రమలలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, కళాశాల ప్రధానోపాధ్యాయులు తిరుమల రావు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, విజయ్ కుమార్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
డిజిటల్ అరెస్టులు మోసపూరితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES