Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్గద్దెల మార్పుపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం: మంత్రి సీతక్క

గద్దెల మార్పుపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం: మంత్రి సీతక్క

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: గద్దెల మార్పుపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజారులు, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండానే ఈ మార్పులు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. “మేడారం జాతర ఒక పవిత్రమైన ఉత్సవం. దానిని రాజకీయాలకు వేదికగా మార్చవద్దు. ఇది కేవలం భక్తితో చూడాల్సిన విషయం” అని ఆమె హితవు పలికారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన జాతరకు ఇప్పుడు సరైన ప్రాధాన్యత ఇస్తున్నామని, భక్తులు సంతోషంగా తమ మొక్కులు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గద్దెల వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించనున్నారని ఆమె వివరించారు. ఈ నెల 13న లేదా 14న సీఎం మేడారం పర్యటనకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, భక్తుల భద్రత, సౌకర్యాలపై పూర్తి శ్రద్ధ పెట్టిందని సీతక్క చెప్పారు. జాతర నిర్వహణలో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూస్తున్నామని, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తోందని ఆమె తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత ఈ పనుల వేగం మరింత పుంజుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad