Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్దైర్యశాలి వీరనారి చిట్యాల ఐలమ్మ 

దైర్యశాలి వీరనారి చిట్యాల ఐలమ్మ 

- Advertisement -

రజక సంఘం జిల్లా నాయకులు విజయ్
నవతెలంగాణ – వనపర్తి 

ధైర్యశాలి, మహిళలకు ఆదర్శవంతురాలు వీరనారి ఐలమ్మ అని రజక సంఘం జిల్లా నాయకులు విజయ్ అన్నారు. ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో వీరనారి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలను బుధవారం ప్రయాణికుల ప్రాంగణంలో స్థానిక రజక సంఘం ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళాలు అర్పించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. చిట్యాల ఐలమ్మ త్యాగాలు మరువలేనివి, ఆమె దైర్యం మహిళలకు ఆదర్శమన్నారు. భూ పోరాటంలో పెత్తందారులకు చెందిన పది లక్షల ఎకరాల భూమిని పేద రైతులకు పంచారన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో ఐలమ్మ జయంతి ,వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారంగా నిర్వహించటం , ఐలమ్మకు తెలంగాణ వీరనారి అనే బిరుదును ఇచ్చి గౌరవించిందని గుర్తుచేశారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కోటిలోని మహిళా విశ్వ విద్యాలయానికి ఐలమ్మ పేరును నామకరణం చేయడ గర్వించదగ్గ విషయం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్బంగా జిల్లా రజక సంఘం తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా నాయకులు పాటు సింగల్ విండో వైస్ ప్రెసిడెంట్ క్యామ రాజు, ఆగారం ప్రకాష్, గ్రామ కమిటీ అధ్యక్షులు కుంచరపు రవీందర్, నారాయణ,పాకిరయ్య,కుంచరపు బాలస్వామి,శ్రీనివాసులు, శివ,ప్రసద్,బాలస్వామి పెద్దాపురం శ్రీను,రమేష్,మహేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగారం ప్రకాష్,బుచ్చిబాబు గౌడ్,వడ్డెర సంగం నాయకులు భూమయ్య,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad