జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
సైబర్ వారియర్స్ పోలీసులకు “టీ షర్ట్స్” అందజేత
నవతెలంగాణ – వనపర్తి
మానవ తప్పిదం, అత్యాశ వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ నేరాలపై సైబర్ పోలీసు వారియర్స్ ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ జిల్లా లోని అన్ని పోలీస్టేషన్లలో పనిచేస్తున్న సైబర్ పోలీసు వారియర్స్ సిబ్బందితో సమావేశం నిర్వహించి సైబర్ నేరాలును నివారించడం, చేదించడంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం సైబర్ పోలీసు వారియర్స్ కు “టీ షర్టులు” అందజేశారు.
ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ సైబర్ వారియర్స్ గా చేస్తున్న వారి అనుభవాలు పనితీరు గురించి తెలుసుకున్నారు. “ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న క్రమంలో ప్రజలకు సైబర్ సెక్యూరిటీ పై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమన్నారు. సైబర్ వారియర్స్ రెగ్యులర్గా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లా సైబర్ సెల్ తో సమన్వయం తో పని చేస్తూ సోషల్ మీడియాలో అనుమాదస్పద కంటెంట్ పై నిఘా ఉంచడం, డిజిటల్ ఫోరెన్సిక్, సైబర్ ఇంటలిజెన్స్ సేకరణ వంటి బాధ్యతలను కూడా సమర్ధవంతంగా చేయాలన్నారు. సైబర్ వారియర్స్ తమ బాధ్యతను నైతికంగా, చట్టబద్ధంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్భి డిఎస్పి మహేశ్వరరావు, సైబర్ క్రైమ్ ఎస్సై రవి ప్రకాష్, డిసిఆర్బి ఎస్సై, తిరుపతిరెడ్డి, మరియు సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై పోలీసు వారియర్స్ ప్రజలకు అవగాహన కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES