మండల ఇంచార్జి ఎంపీపీఓ రామ్మూర్తి
నవతెలంగాణ – మల్హర్ రావు
అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఎనలేని పోరాటాలు చేసింది వీరనారి ఐలమ్మని మండల ఇంచార్జి ఎంపిడిఓ రామ్మూర్తి అన్నారు. ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐలమ్మ వర్థంతి వేడుకలు నిర్వహించి, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడారు. ఐలమ్మ 1899లో వరంగల్ జిల్లాలోని గుంటూరు గ్రామంలో ఓ పేద కుటుంబంలో జన్మించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జమీందార్లకు ఎదురెరిగి ధైర్యంగా నిలబడ్డ ఆమె, తన భూమిని ఆక్రమించేందుకు వచ్చిన దోపిడీదారులను తుపాకీతో ఎదుర్కొని రైతులకు న్యాయం చేసిందన్నారు. అణగారిన వర్గాల గౌరవం కోసం పోరాడిన ఆమె సాహసం ప్రజలకు ప్రేరణగా నిలిచిందని, అందుకే ఐలమ్మను నిర్భయ మహిళగా, తెలంగాణా రైతాంగ పోరాటానికి చిహ్నంగా స్మరించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
అణగారిన వర్గాల కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES