- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం కమిటీని బుధవారం మండల కేంద్రంలో ఉన్న విస్తరాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా అడ్డగూరి భూమన్న, సెక్రటరీగా, యాద పుల్లయ్య, కోశాధికారి గా పూడూరి రాజయ్య, అసోసియేట్ అధ్యక్షులు గా దుర్గాప్రసాద్ , సహా అధ్యక్షులు గా కూకటికారి బుచ్చయ్య, వైస్ ప్రసిడెంట్ గా శారద, జాయింట్ సెక్రటరీగా ఎన్. లచ్చన్న, ఆర్గానేసింగ్ సెక్రటరీ గా ఏం. భాస్కర్ గౌడ్ , పబ్లిటీ సెక్రటరీ గా చరణ్ దాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న అన్నారు. కార్యక్రమంలో మండలంలోని విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.
- Advertisement -