- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని ముత్యం పల్లి, అమ్రాద్ గ్రామాల్లో ఉమెన్స్ కాలేజ్ కాంటేశ్వర్ నిజామాబాద్ వారు నిర్వహించే జాతీయ సేవా పథకం శీతాకాల శిబిరం మూడవ రోజు బుదవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాలింటర్ యూనిట్ ఆద్వర్యంలో సన్ రైస్ ఆసుపత్రి ఆద్వర్యంలో ముత్యం పల్లి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. అందులో ఎన్ఎస్ఎస్ వాలింటర్ పాల్గొని గ్రామ ప్రజలకు సేవలు చేశారు. రెండవ యూనిట్ వాలింటర్ వారు అమ్రాద్ గ్రామంలో స్వచ్చత, పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించి, గ్రామస్థులకు మొక్కలను అందజేసి, మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కే. మాధవి, అర్. మమత, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -