భర్తతో కలిసి ఘాతకం
జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెద్దతండా కే లో విషాదం
నవతెలంగాణ – పాలకుర్తి
ప్రస్తుత తరుణంలో మానవ సమాజం మంటల్లో కలుస్తుంది. రక్త బంధాలు, పేగు బంధాలు మంటల్లో కలుస్తున్నాయి. నవ మాసాలు మోసి పురిటి నొప్పులతో జన్మనిచ్చిన తల్లిని కన్న కూతురే భర్తతో కలిసి ఆస్తి కోసం గొంతు నులిమి హత్య చేసిన సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెద్దతండ కె గ్రామపంచాయతీ లో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తండావాసులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..మండలంలోని పెద్ద తండ కె గ్రామానికి చెందిన బాదావత్ లక్ష్మి(45) తన కుమార్తె సంగీతను మండలంలోని దుబ్బ తండా ఎస్పీ గ్రామానికి చెందిన భూక్య వీరన్నతో గత ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేశారని తెలిపారు. బాదావత్ లక్ష్మీ కి ఉన్న ఎకరం భూమిలో 20 గుంటల భూమిని అమ్మి ఇటీవలే కుమార్తె సంగీతకు 9 తులాల బంగారాన్ని ఇప్పించారని తెలిపారు.
భూమి అమ్మిన మిగతా డబ్బులతో పాటు 20 గుంటల భూమిని తమకు ఇవ్వాలని గత కొంతకాలంగా లక్ష్మీ ని ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. మృతురాలు లక్ష్మీ ఒప్పుకోకపోవడంతో లక్ష్మీ ని చంపి ఆస్తిని కైవసం చేసుకోవాలని పథకం వేసిన కుమార్తె.. సంగీత వీరన్న తో కలిసి మంగళవారం అర్ధరాత్రి కారులో తండాలో లక్ష్మీ ఇంటికి చేరుకున్నారని తెలిపారు. అప్పటికే లక్ష్మి భయభ్రాంతులకు గురై ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చిందని, దీంతో ఇరుగుపొరుగువారు సంగీతతో పాటు భర్తను నిలదీయగా కారులో పట్టికుని తీసుకువచ్చామని బదులిచ్చారని తెలిపారు.
పథకం ప్రకారం ఇంట్లో నిద్రిస్తున్న లక్ష్మీని కుమార్తె సంగీత భర్త వీరన్నతో కలిసి గొంతు నులిమి హత్య చేశారని, అదే రాత్రి కారులో వెళ్లిపోయారని తెలిపారు. బుధవారం తెల్లవారేసరికి లక్ష్మీ ఇంట్లో అనుమానస్పదంగా మృతి చెంది ఉందని వివరించారు. ఇరుగుపొరుగు వారిని సమాచారం తెలుసుకున్న పోలీసులు లక్ష్మి కుమార్తె, అల్లుడు కలిసే ఈ హత్యను చేశారని పోలీసులకు వివరించారు. లక్ష్మి మృతి సమాచారాన్ని తెలుసుకున్న కుమార్తె సంగీత, అల్లుడు వీరన్న ఆలస్యంగా వచ్చి మేమే ఆస్తికోసం చంపామని ఒప్పుకున్నారని తెలిపారు. మృతురాలి తండ్రి నేనావత్ చంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్ రెడ్డి, ఎస్సై దూలం పవన్ కుమార్ లు తెలిపారు. లక్ష్మీని కుమార్తె హత్య చేయడంతో తండాలో విషాదం అలుముకుంది.
దారుణం.. ఆస్తి కోసం కన్నతల్లిని హత్య చేసిన కుమార్తె
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES