- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండల కేంద్రంలో కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారి పై ఇటీవల ఎస్సై శంషుద్దీన్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామానికి చెందిన జయకృష్ణ మద్యం తాగి బైక్ పై వెళ్తుండగా పట్టుబడ్డారు. దీంతో అతనిని బుధవారం కల్వకుర్తి కోర్టులో కానిస్టేబుల్ సురేష్ గౌడ్ హాజరుపరచగా జడ్జి కావ్య రెండు రోజులు రిమాండ్ విధించినట్లు కోర్టు కానిస్టేబుల్ సురేష్ గౌడ్ తెలిపారు.
- Advertisement -